అలీ ఎక్కడ..వైసీపీ ప్రచారంలో ఎక్కడ లేడేంటి..?

గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున సినీ నటుడు అలీ విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకు గాను ఆయనకు అధిష్ఠానం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవినిచ్చింది. అయితే గత ఎన్నికల సమయంలో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించగా సాధ్యపడలేదు. ఈ ఎన్నికల్లోనైనా సీటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది.

దీంతో ఆయన గత కొద్దీ నెలలుగా సైలెంట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నడుస్తున్న కానీ ఆయన మాత్రం కనిపించకపోయేసరికి అంత అలీ ఎక్కడ అని అడుగుతున్నారు. కానీ అలీ మాత్రం ప్రచారం చేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని వినికిడి. టికెట్ కోసం ఆశించినప్పటికీ జగన్ ఇవ్వకపోయేసరికి అలీ పార్టీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు.