జ‌గ‌న్ త‌న అధికారాన్ని అడ్డేసి మ‌రీ హంత‌కుల‌ను ర‌క్షిస్తున్నారుః ష‌ర్మిల

Jagan is blocking his authority and protecting many murderers: Sharmila

అమరావతిః పులివెందుల‌లో ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “చిన్నాన్న వివేకాను అతి కిరాత‌కంగా న‌ర‌కి చంపారు. ఈ హ‌త్య జ‌రిగి ఐదేళ్లు గ‌డిచిపోయాయి. ఇప్ప‌టికీ హ‌త్య చేసిన వారికి శిక్ష ప‌డ‌లేదు. అవినాశ్‌రెడ్డి నిందితుడ‌ని సీబీఐ చెబుతోంది. సీఎం జ‌గ‌న్ త‌న అధికారాన్ని అడ్డేసి మ‌రీ హంత‌కుల‌ను ర‌క్షిస్తున్నారు. సొంత చిన్నాన్న‌కే న్యాయం చేయ‌క‌పోతే ఇంకెవ‌రికి న్యాయం చేస్తారు?” అని ఆమె ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా చిన్నాన్న వివేకాపై ష‌ర్మిల త‌న అభిమానాన్ని చాటారు. రాముడికి లక్ష్మ‌ణుడు ఎలాగో.. వైఎస్ఆర్‌కు వివేకా అలాంటి వారేన‌ని ఆమె అన్నారు.