వరంగల్ బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?

Tatikonda Rajaiah as Warangal BRS MP candidate?

హైదరాబాద్‌ః వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును పార్టీ అధినేత కెసిఆర్ దాదాపు ఖరారు చేశారు. పార్టీ అధినేత నుంచి పిలుపు రావడంతో రాజయ్య ఎర్రవెల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరారు. ఇరువురు చర్చించుకున్న అనంతరం కెసిఆర్ రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది.

అధినేత బుజ్జగింపుల తర్వాత ఆయన కడియం శ్రీహరి గెలుపు కోసం పని చేశారు. ఆ తర్వాత వరంగల్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కెసిఆర్ ప్రకటించారు. కానీ అనూహ్యంగా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బిఆర్ఎస్ అభ్యర్థి కోసం పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు రాజయ్యను కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.