కెసిఆర్‌ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత..

Tension at KCR farm house..

హైరదాబాద్‌ః బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1,100 మంది పేర్లను తీశారని… వీరిలో ఒక్కరికి కూడా ఇంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు, ఒంటేరులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరిగామని… ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ లో ఉన్న తాము ఏం పాపం చేసుకున్నామని ప్రశ్నించారు. తాము ఇక్కడకు వచ్చి ఎంతో సేపు అవుతున్నా కెసిఆర్ నుంచి కనీస స్పందన కూడా రాలేదని చెప్పారు. గేట్ వద్ద ఉన్న తమకు ఫామ్ హౌస్ లోపల నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.