చరణ్ కు నత్తి ..?

మెగా పవర్ రామ్ చరణ్ కు నత్తి ..? ఇప్పుడు ఇదే మెగా అభిమానులను ఖంగారుకు గురి చేస్తుంది. రంగస్థలం మూవీ లో చెవిటి వాడిగా అద్భుతమైన నటన కనపరిచిన రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా , అంజలి , శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా..ఓ వార్త బయటకు వచ్చి మెగా అభిమానులను కాస్త ఖంగారుకు గురిచేస్తుంది.

ఈ మూవీ లో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. తండ్రీకొడుకుల పాత్రలను చరణ్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్రకు నత్తి వుంటుందట. ఈ పాత్ర కోసం శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం. అయితే, ఈ తరహా పాత్ర టాలీవుడ్ కు కొత్తేం కాదు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ‘లైగర్’ లో, అంతకంటే ముందు ‘లవకుశ’లో ఎన్టీఆర్ చేశారు. లవకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించారు. అందులో ఓ పాత్రకు నత్తి ఉంది. అయితే చరణ్ కు నత్తి అనేది సెట్ అవుతుందా అని అభిమానులు కాస్త ఖంగారు పడుతున్నారు.