పోలీసుల దగ్గర నిజం ఒప్పుకున్న వనమా రాఘవ

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ..పోలీసుల వద్ద రామకృష్ణ ను బెదిరించినట్లు నిజం ఒప్పుకున్నట్లు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ శుక్రవారం రాత్రి దమ్మపేట మండలం మందలపల్లి లో పోలీసులకు చిక్కాడు. ఆంధ్ర కు పారిపోతుండగా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసారు. నిన్న రాత్రే కొత్తగూడెం తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

రాఘవతో పాటు గిరీష్, మురళిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాఘవ పరారయ్యేందుకు చావా శ్రీనివాస్, రమాకాంత్​ సహకరించారు. పలు అంశాలపై రాఘవను విచారించాము. రామకృష్ణను బెదిరించినట్లు అతను ఒప్పుకున్నాడు. నిందితులను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరుస్తాం. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి. గతంలో నమోదైన కేసులపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.

మరోపక్క రామకృష్ణ ఆత్మహత్య చేసుకోబోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలు బయటకొస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ వీడియో బయటకు రాగా..శనివారం మరో వీడియో బయటపడింది. ఈ వీడియో లో పలు సంచలన విషయాలు రామకృష్ణ తెలిపారు. తన అక్క మాధవితో..రాఘవ కు గతః 20 ఏళ్లుగా అక్రమసంబంధం ఉందని తెలిపాడు.