ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీలో మరో గొప్ప పధకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అధికారికంగా ప్రారంభించారు. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్‌ దేశ చరిత్రలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అదునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానం అని ఈ సందర్బంగా జగన్ అన్నారు. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదు…రాష్ట్రం లో నేటి నుండి ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు లోకి వచ్చిందని తెలిపారు.

దేశానికి ఆదర్శం గా ఫ్యామిలీ డాక్టర్ విధానం నిలవబోతుంది..ఇక పై డాక్టర్ కోసం మీరు బయటకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. ప్రతి పేదవాడి ఇంటి ముందుకు డాక్టరు,మందులు వస్తాయి. పెన్షన్లు మీ ఇంటికి నడిచి వచ్చినట్లు గా వైద్యం కూడా మీ ముంగిట్లో కి వస్తుందని వెల్లడించారు. ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ లు ఉంటాయని, ఇందులో 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తామని తెలిపారు. వీటిలో సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు అందుతాయని వివరించారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, ఇక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో నయం కాని రోగాలను వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ద్వారా ఆరోగ్యశ్రీకి రిఫర్ చేస్తారని చెప్పుకొచ్చారు.

అలాగే మంత్రి విడదల రజిని మాట్లాడుతూ..‘భారతదేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలని మన సీఎం జగన్ బలంగా నమ్మారు. అందుకే చక్కటి వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ వలంటీర్‌ వ్యవస్థ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మబంధువులా పనిచేస్తుంది. గ్రామాలు, పట్టణాల్లో వలంటీర్లు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అందరికీ తెలుసు. అదే దిశగా ప్రతి గ్రామంలో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లు దర్శనమిస్తున్నాయి. గ్రామ ఆరోగ్య సౌభాగ్యమే.. దేశ ఆరోగ్య సౌభాగ్యమని అంటుంటారు. అది దృష్టిలో పెట్టుకొని వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌కు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును తీసుకువచ్చారు.

సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2007లో ఇదే ఏప్రిల్‌ నెలలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యరంగంలో ఆరోగ్యశ్రీతో విప్లవాత్మక పథకానికి నాంది పలికారు. ఆరోగ్యశ్రీ పథకం దేశానికే దిక్సూచిగా నిలిచి సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల తరువాత వైద్యరంగంలో ఇదే ఏప్రిల్‌లో ఆ మహానేత తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ తండ్రికి మించి పేదలకు మంచి అని మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి విడదల రజిని.