ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం – జగన్

ఏపీలో ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతుండడంతో నేతల్లో , ప్రజల్లో ఆసక్తి , టెన్షన్ మరింత పెరుగుతుంది. గెలుపు ఫై ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ..లోలోపల మాత్రం భయం ఉంది. ఇదిలా ఉంటె తాజాగా సీఎం జగన్ చేసిన ట్వీట్ తో వైసీపీ శ్రేణుల్లో ధైర్యం పెరిగినట్లు అయ్యింది.

దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతీ కుటుంబానికీ తమ ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందంటూ ఆయన ట్వీట్ చేసారు.

విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్, భారతి దంపతులు ఈరోజు రాష్ట్రానికి చేరుకోనున్నారు. నిన్న రాత్రి వారు లండన్ నుంచి వారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో జగన్ పర్యటించారు. పర్యటన ముగించుకుని15 రోజుల అనంతరం రాష్ట్రానికి రానున్నారు జగన్.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. <br>ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… <a href=”https://t.co/6EOA8CGend”>pic.twitter.com/6EOA8CGend</a></p>&mdash; YS Jagan Mohan Reddy (@ysjagan) <a href=”https://twitter.com/ysjagan/status/1796137759050178770?ref_src=twsrc%5Etfw”>May 30, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>