మోడి విధానాల వల్ల భారత్‌ మాంద్యంలోకి వెళ్లింది

rahul-gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోడి ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ..ప్రధాని మోడి అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్లే భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ క్షీణించిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. భార‌త్ తొలిసారి మాంద్యంలోకి ప్ర‌వేశించింద‌ని, మోడి చ‌ర్య‌ల వ‌ల్ల దేశంలోని బ‌లాల‌న్నీ బ‌ల‌హీన‌త‌లుగా మారిన‌ట్లు రాహుల్‌ విమ‌ర్శించారు. దేశ జీడీపీ రెండ‌వ క్వార్ట‌ర్‌లో మైన‌స్ 8.6 శాతానికి క్షీణించ‌నున్న‌ట్లు ఆర్‌బీఐ త‌న నౌకాస్ట్ నివేదిక‌లో వెల్ల‌డించింది. దీనిపైనే రాహుల్ కామెంట్ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/