పెన్షన్‌ పెంపుపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం

ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఏపీ ప్రభుత్వం. పెన్షన్‌ పెంపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు కానుంది.

పెన్షన్‌ను రూ.3వేలకు పెంచుకుంటూ పోతామంటూ ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2250కు, రూ.2500కు రెండు విడతలుగా పెంచారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.2500ను రూ.2750 లకు పెంచుతూ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.130.44 కోట్లు నెలకు అదనపు వ్యయం పడనుంది. అలాగే సుమారు నెలకు రూ.1720 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో 62 లక్షల పైచిలుకు పెన్షనర్లు ఉన్నారు. కొత్తగా డిసెంబరులో ఇవ్వనున్న 2.43 లక్షల మందితో కలుపుకుంటే మొత్తం పెన్షనర్ల సంఖ్య 64.74 లక్షలు కానున్నారు.

అలాగే వైఎస్సార్‌ పశు బీమా పథకం ప్రతిపాదనలకు సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్‌ క్లాస్‌లు, ఫౌండేషన్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్‌లను నాడు- నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు ఆమోద ముద్రవేసింది.