విశాఖ ఫిషింగ్ హార్బర్ బాధితులకు నష్ట పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆదివారం అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 40 కి పైగా బొట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం వల్ల మృత్యుకారులకు దాదాపు రూ.40 కోట్ల మేర నష్టపోయారు. ఈ క్రమంలో వారంతా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

దీంతో బాధితులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ముందుకు వచ్చింది. దాదాపు 80 శాతం సాయాన్ని అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే మత్యకారులను మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించిన సంగతి తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.