ఎమ్మెల్సీ అనంతబాబుకు అక్టోబర్ 7 వరకు రిమాండ్ పొడిగింపు

ఇదివరకు విధించిన రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరచిన పోలీసులు

mlc-anantha-babu-fjudicial-remand-extended

అమరావతిః హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు.

దీంతో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఫలితంగా తిరిగి ఎమ్మెల్సీని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును ఒప్పుకున్న దరిమిలా ఆయనను వైఎస్‌ఆర్‌సిపి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/