నామినేషన్‌ వేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Union Home Minister Amit Shah nominated

న్యూఢిల్లీః లోక్‌ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ నామినేషన్ వేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం పటేల్‌తో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక గాంధీనగర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున సోనాల్‌ పటేల్‌ బరిలోకి దిగారు.

మరోవైపు ఉదయం 11 గంటల వరకు తమిళనాడు 23.72 శాతం పోలింగ్‌ నమోదైంది. అండమాన్‌ నికోబార్‌లో 21.82, అరుణాచల్‌ప్రదేశ్‌లో 18.26, అసోం 27.22, బిహార్‌ 20.42, ఛత్తీస్‌గఢ్‌ 28.12, జమ్ముకశ్మీర్‌ 22.60, లక్షద్వీప్‌ 16.33 శాతం ఓటింగ్​ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో 30.46, మహారాష్ట్ర 19.17, మణిపూర్‌ 28.19, మేఘాలయ 31.65, మిజోరం 26.56, నాగాలాండ్‌ 22.82, పుదుచ్ఛేరి 27.63, రాజస్థాన్‌ 22.51, సిక్కిం 21.20, త్రిపుర 33.86, ఉత్తర్‌ప్రదేశ్‌ 25.20, ఉత్తరాఖండ్ 24.83, బంగాల్‌ 33.56 పోలింగ్ శాతం నమోదైంది.