తెలంగాణలో అత్యధిక డబ్బు లభించింది – ఈసీ

తెలంగాణ తో మరో నాల్గు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ , తెలంగాణ , రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్గఢ్ లకు సంబదించిన ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 25, నవంబర్ 30 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ లోనే ఎక్కువ మొత్తం నగదు లభించినట్లు తెలిపింది. తెలంగాణలో అత్యధికంగా 225.25 కోట్ల నగదును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్‌లో 93.17 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 33.72 కోట్లు, పట్టుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. మిజోరాంలో నగదు లేదా విలువైన లోహం స్వాధీనం చేసుకోలేదు, అయితే 29.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ముగిసే ఈ గణాంకాలు భారీగా పెరగనున్నాయి.