కారు జోరు..తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ సందడి

ఓట్ల లెక్కింపు తొలి ట్రెండ్స్ లో టిఆర్‌ఎస్‌ హవా

ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరు కోనసాగుతుంది. ఓట్ల లెక్కింపు తొలి ట్రెండ్స్ లో టిఆర్‌ఎస్‌ హవా చాటుతోంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల మినహా దాదాపుగా టిఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతూ… క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని టిఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. టిఆర్‌ఎస్‌ నేతలు వరుసగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ తెలంగాణ భవన్ లోనే ఉండి ఫలితాల సరళిని తెలుసుకుంటున్నారు. వెలువడుతున్న ఫలితాలతో పార్టీ నేతలతో కలిసి కెటిఆర్‌ సందడి చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/