ఈరోజు కేసీఆర్ తెలంగాణ భవన్ కీలక ప్రెస్ మీట్

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ మరో 48 గంటలు కూడా లేదు. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో కీలక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల పై కీలక వ్యాఖ్యలు చేయమన్నారు. అలాగే… గులాబీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. ఇక హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… కెసిఆర్ ఇవ్వాలా కీలక వ్యాఖ్యలు చేస్తారని అంత భావిస్తున్నారు.