ఇందిరాదేవి మృతి చెందారనే వార్త కలచివేస్తోందిః చిరంజీవి

మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్న చంద్రబాబు

Chiranjeevi
Chiranjeevi

హైదరాబాద్ః ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేశ్ బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబసభ్యులకు అందించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని… ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని… సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

కాగా, సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ తెల్లవారుజామున మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఇటీవలే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. తాజాగా ఇందిరాదేవి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మరోవైపు కృష్ణ, మహేశ్ బాబులకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/