తెలంగాణ వ్యాప్తంగా ఐటీ దాడుల కలకలం

బుధువారం ఉదయం నుండి తెలంగాణ వ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. గత కొద్దీ రోజులుగా తెలంగాణ లోని పలువురు రాజకీయ నేతలకు సంబదించిన ఇళ్లలో , ఆఫీస్ లలో అలాగే పలు కంపనీ లపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు మరోసారి ఐటీ దాడులు జరుగుతుండడం తో అందర్నీ టెన్షన్ లో పడేసింది.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థల్లో తనిఖీలు చేస్తోన్నారు. హైదరాబాద్‌లోని అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, పటాన్‌చెర్వు, సికింద్రాబాద్‌లో ఐటీ దాడులు జరుగుతోన్నాయి.

అలాగే మెదక్‌, వరంగల్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతోన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకకాలంలో పలు సంస్థలు, కార్యాలయాల్లో దాడులు చేపడుతోన్నారు. బాలవికాస సంస్థలో కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు డైరెక్టర్లుగా సురేష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి ఏలేటి, సురేష్ రెడ్డి సింగిరెడ్డి ఉన్నట్లు సమాచారం.