ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు మానుకోవాలి

జాతీయ పార్టీలుగా ఉండి ప్రాంతీయ పార్టీని ఎదుర్కొలేకపోయారు

V. Srinivas Goud
V. Srinivas Goud

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌, బిజెపి మున్సిపల్‌ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీని ఎదుర్కొలేక ఇష్ట వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే కులాల మధ్య చిచ్చు పెట్టి.. ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోయారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేయడం మానేసి ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ పూలే వారసుడని, అన్ని వర్గాల ప్రజలను ఆయన న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి నాయకుడు దేశానికి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/