సీఏఏ ఏ ఒక్క ముస్లిం పౌరసత్వాన్ని హరించదు

గత 70 ఏళ్లలో పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించారు

amit shah
amit shah

భువనేశ్వర్‌: సీఏఏ వల్ల ముస్లింలు పౌరసత్వం కోల్పోతారంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. పైగా ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఏఏ అవగాహన సభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. సీఏఏ ఏ ఒక్క ముస్లిం పౌరసత్వాన్ని హరించదు అని ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసి అల్లర్లు ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. సీఏఏలో ఏ క్లాజ్‌ పౌరసత్వాన్ని హరించేలా ఉందో ప్రజలు నిలదీయాలన్నారు. గత 70 ఏళ్లలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించారని అమిత్‌ షా పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/