తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ..వారు ఎవరంటే..!!

తెలంగాణ లో మరోసారి పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి అన్ని శాఖల్లో అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది బదిలీ కాగా..తాజాగా మరో 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు. పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐఏఎస్‌ ఇంటి వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌ను నియమించారు.

బదిలీ అయిన వారు ఎవరంటే..

రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి
రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు
సైబరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా జోయల్‌ డేవిస్‌
సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌
ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా అపూర్వరావు
సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ఉదయ్‌ కుమార్‌
ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా గిరిధర్‌
హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ
మల్టీజోన్‌-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్‌బాబు బదిలీ (ఇటీవలే రాచకొండ కమిషనర్‌గా వెళ్లిన సుధీర్‌బాబు)