సీఎం రేవంత్‌ రెడ్డితో వైఎస్‌ షర్మిల భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో..ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ప్రస్తుతం కృష్ణ జలాల వివాదం హాట్ హాట్ గా నడుస్తున్న క్రమంలో షర్మిల భేటీ అవ్వడం సర్వత్రా చర్చ గా మారింది. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

కృష్ణా జలాల అంశంపైన కూడా చర్చించినట్లు సమాచారం. అయితే ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక, వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తాజాగా.. రెండు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన వేళ వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.