ముఖ్యమంత్రి గారి దళితవాదం నేతి బీరకాయలో నెయ్యేనా?

అనంతబాబును బయటకు తీసుకురావాలనే తపనలో ప్రభుత్వం ఉందన్న వర్ల రామయ్య

అమరావతి: తన మాజీ డ్రైవర్ ను హత్య చేశారనే కేసులో ఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. దళితుడ్ని చంపి, జైలుపాలైన ఎమ్మెల్సీ అనంతబాబును వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలనే తపన ప్రభుత్వంలో అణువణువునా కనిపిస్తోందని అన్నారు. ఈ ప్రభుత్వం హత్యగావించబడిన దళితుడి వైపా? లేక అధికారమదంతో హత్య చేసిన అనంతబాబు వైపా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారి దళితవాదం నేతి బీరకాయలో నెయ్యేనా? అని ఎద్దేవా చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/