కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారుల తీరు మారడం లేదుః లోకేశ్‌

కొందరు అధికారులు జగన్ ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారన్న లోకేశ్

lokesh

అమరావతిః టిడిపి నేత నారా లోకేశ్‌ దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి జగన్ లపై విమర్శలు గుప్పించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడని అన్నారు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లు సహా పలువురు పోలీస్ అధికారులను జగన్ జైలు పాలు చెయ్యబోతున్నాడని చెప్పారు. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సీఐడీ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారుల తీరు మారడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/