రాజ్​భవన్​లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గవర్నర్ తమిళిసై

బతుకమ్మ సంబరాలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేస్తున్నారు. శనివారం రాజ్​భవన్​లో బతుకమ్మ చీరలను గవర్నర్ తమిళిసై పంపిణి చేసారు. తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక మాత్రమే కాదు.. బతుకమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

రాజ్ భవన్ లోని మహిళా ఉద్యోగులు, సిబ్బందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారంతా గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.