రేపు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రేపు సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యహ్నం 2 గంటలకు తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు, డీసీఎంఎస్ అధ్య‌క్షులు, డీసీసీబీ అధ్య‌క్షులు, రైతుబంధు జిల్లా క‌మిటీల అధ్య‌క్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, టీఆర్ఎస్ పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యులు హాజ‌రు కానున్నారు.

సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో వరి ప్రత్యామ్నాయ పంటలపై చర్చ జరుగనుంది. రాష్ట్రంలో ఏ పంటలు వేస్తే లాభమనే అంశంపై పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. అలాగే, రాష్ట్రంలో పార్టీ పటిష్టంపై నాయకులుకు సీఎం సూచనలు చేసే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/