ఐపిఎల్‌ ఫ్రాంచైజీలకు బిసిసిఐ భారీ షాక్‌

Board of Control for Cricket in India
Board of Control for Cricket in India

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌ ఫ్రాంచైజీలకు బిసిసిఐ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఐపిఎల్‌ సీజన్‌ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీని సగానికి తగ్గించింది. ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ఫ్రాంచైజీలకు జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. బిసిసిఐ ప్రకటర ప్రకారం.. ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా క్యాష్ రివార్డ్స్‌‌ను తగ్గించాం. ఈ సీజన్ చాంపియన్ జట్టు రూ.10కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనుంది. గతంలో ఇది రూ.20కోట్లుగా ఉండేది. అలాగే రన్నరప్‌కు గతంలో రూ.12.5కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వగా.. ఈ ఏడాది రూ.6.25కోట్లు మాత్రమే గెలుచోనుంది.’అని తెలిపింది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఒక్కొక్కరికి రూ.4. 3కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. అన్ని ఫ్రాంచైజీలు మంచి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. వారి ఆదాయాన్ని పెంచడం కోసం స్పాన్సర్‌షిప్ లాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందుకే ప్రైజ్ మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం.’అని ఓ బిసిసిఐ అధికారి మీడియాకు తెలిపాడు. కాగా ఈ ఏడాది మార్చి 29నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్‌.. మే 24న ముగియనున్న విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/