వడగళ్ల వర్షంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యం

airasia-flight-makes-emergency-landing-kolkata
airasia-flight-makes-emergency-landing-kolkata

కోల్‌కతా: కోల్‌కతా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోగ్రాకు వెళ్లాల్సిన ఎయిర్‌ ఎసియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగివచ్చి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. కోల్‌కతా విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం 15-536 నంబరు గల ఎయిర్‌ ఎసియా 170 మంది ప్రయాణికులతో టేకాఫ్‌ అయింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కురిసిన వడగళ్ల వర్షంతో విమానం విండ్‌ షీల్డు దెబ్బతింది. దీంతో పైలెట్‌ విమానాన్ని తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని, ఈ అసౌకార్యానికి చింతిస్తున్నామంటూ విమానయాన సంస్థ ముఖ్య భద్రతా అధికారి క్షమాపణలు చెప్పారు. ఈ విమానంలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర మంత్రి అరూప్‌ బిశ్వాస్‌ ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/