ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం
బీసీసీఐ వెల్లడి

New Delhi: ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 18న జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021కి సంబంధించి క్రికెటర్ల వేలం వచ్చేనెల 18న జరుగుతుందని బీసీసీఐ అధికారి తెలిపారు.
అయితే వేలం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. గతంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఐపీఎల్ 2021 స్వదేశంలోనే నిర్వహిస్తామని తెలిపారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2020ను దుబాయ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈసారి మెగా టోర్నీని భారత్‌లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు గంగూలీ వెల్లడించాడు.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/