విజయసాయిరెడ్డి కారుపై దాడి కేసులో ఏ1గా చేర్చుతూ రిమాండ్‌ రిపోర్ట్‌

పోలీసులు నివేదిక

Chandra babu Naidu
Chandra babu Naidu

Vijayanagaram: నెల్లిమర్ల పరిధిలోని రామతీర్థంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి  ఘటనలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏ1గా చేర్చుతూ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ను తయారు చేశారు.

రామతీర్థం దాడి ఘటనలో చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుపై నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో పీడీసీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న అభి యోగాలపై మరో తొమ్మిది మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురికి స్థానిక కోర్టు ఇప్పటికే రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/