ఐపీఎల్‌- 2022 పూర్తి షెడ్యూల్‌ విడుదల

మార్చి 26న తొలి మ్యాచ్‌- మే 29న ఫైనల్‌ మ్యాచ్‌

IPL-2022 full schedule released
IPL-2022 full schedule released

ఐపీఎల్‌- 2022 సీజన్‌ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది మార్చి 26 న మొదటి మ్యాచ్‌ జరగనుండగా, మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మొదటి మ్యాచ్‌ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరగనుంది. కాగా ఐపీఎల్‌-15 సీజన్ మొత్తం 65 రోజుల పాటు జరగనుంది. మొత్తం 70 లీగ్‌ మ్యా్‌చ్‌ లు జరుగనున్నాయి. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మే22న చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.
ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్ లు చొప్పున జరగనుండగా… పుణేలోని ఎంసీఏ స్డేడియంలో, ముంబైలోని బ్రబోర్న్ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి. ఈసారి మొత్తం 12 డబుల్ హెడర్స్ జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ 3.30లకు ప్రారంభంకానుండగా .. రాత్రి మ్యాచ్ గం. 7.30లకు స్టార్ట్ కానుంది. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ పోరు ముగుస్తుంది. ఫైనల్ వేదికను వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/