బిగ్ బాస్ 5 : సభ్యులంతా గొడవ లో ఉంటె..శ్రీరామ్ మాత్రం హమీదా తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు

బిగ్ బాస్ 5 రెండో వారం వాడి వేడిగా నడుస్తుంది. కెప్టెన్‌ టాస్క్ లో భాగంగా హౌస్ లో పలు టాస్క్ లు నడుస్తున్నాయి. సభ్యులు నక్క , గద్ద టీం లు విడిపోయి నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేస్తున్నారు. స్నేహితులుగా ఉన్నవాళ్లు కూడా గేమ్‌లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మొత్తానికి బిగ్‌బాస్‌ ఇచ్చిన ఈ టాస్కులో గద్ద టీమ్‌ గెలిచినట్లు తెలుస్తుంది. టాస్క్ విషయంలో రెండు సభ్యులు గొడవ పడుతుంటే..కాస్త బ్రేక్ దొరకగానే శ్రీరామచంద్ర, హమీదా స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కబుర్లాడుతూ కూర్చున్నారు. అక్కడితో ఆగకుండా శ్రీరామ్..హమీద కు మసాజ్ చేస్తూ కనిపించాడు.

హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనుకుంటాను అని మనసులో మాట బయట పెట్టింది. దీనికి ఏదోలా ఉందీ వేళ నాలో.. ఈ వింత ఏమిటో.. గిలిగింత ఏమిటో అని బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్‌ సాంగ్‌ ప్లే చేశాడు బిగ్‌బాస్‌. ఇది చూసిన నెటిజన్లు.. అక్కడ అంత గొడవ జరుగుతుంటే వీళ్లు ఈ గ్యాప్‌లో శ్రీరామ్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడని కామెంట్స్ వేస్తున్నారు. మొత్తం మీద హౌస్ లో టాస్క్ లు , ఫైట్ లు , గొడవలు , లవ్ లు , కామెడీ , రొమాన్స్ ఇలా అన్ని సమపాలనలో ఉండేలా బిగ్ బాస్ చూసుకుంటున్నాడు.