బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు: 5 గురు జవాన్లు మృతి

అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌ మెస్‌లో దారుణం

bsf camp
bsf camp

అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌లో దారుణం చోటు చేసుకుంది. సహచర సిబ్బందిపై ఒక బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. 10 మందికి గాయాలు అయ్యాయి. కాగా, క్యాంపులోని మెస్‌లో అమృత్‌సర్‌లోని హెచ్‌క్యూ 144 బిఎన్ ఖాసాలో కానిస్టేబుల్ సత్తెప్ప జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో అతను కూడా మృతిచెందినట్టు తెలిసింది. అతనితో కలిపి మొత్తం 5గురు మృతి చెందినట్లు వెల్లడించారు. గాయపడిన మరొక ఒక జవాన్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గురునానక్ దేవ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/