ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

ఈ రోజు సాయంత్రం ప‌రీక్ష‌ల ఫ‌లితాల విధానంపై ప్ర‌క‌ట‌న‌

హైదరాబాద్: కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 కాగా, ప‌రీక్ష‌ల ర‌ద్దుతో పాటు, వాటి ఫ‌లితాల విధానాల‌పై ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్ర‌భుత్వం వివ‌రాలు తెల‌ప‌నుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/