థాయ్ లాండ్ కు వెళ్లనున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు
ఆశ్రయం ఇవ్వాలని థాయ్ లాండ్ ను కోరిన గొటబాయ

కొలంబోః శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విచిడి మాల్దీవులకు అక్కడి నుంచి సింగపూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తనకు ఆశ్రయమివ్వాలని థాయ్ లాండ్ ను కోరారు. ఆయన విన్నపం పట్ల థాయ్ లాండ్ సానుకూలంగా స్పందించింది. ఆశ్రయమిచ్చేందుకు ఓకే చెప్పింది.
అయితే, కేవలం మానవతా దృక్పథంతోనే తాత్కాలికంగా తమ దేశంలో ఉండేందుకు అవకాశం ఇస్తున్నామని థాయ్ లాండ్ తెలిపింది. తమ దేశంలో ఉంటూ రాజకీయ కార్యకలాపాలను నిర్వహించకూడదని షరతు విధించింది. గొటబాయ రాజపక్సకు థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ అనుమతిని ఇచ్చినట్టు బ్యాంకాక్ పోస్ట్ పత్రిక వెల్లడించింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/