బాహుబలి ఫేమ్ కట్టప్ప ఆరోగ్య పరిస్థితి విషమం..

బాహుబలి ఫేమ్ సత్య రాజ్ (కట్టప్ప) ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. రీసెంట్ గా కరోనా బారినపడిన సత్యరాజ్..డాక్టర్స్ సలహాల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగా మారడం తో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషయంగానే ఉన్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా కరోనా ఉదృతి మరింత పెరిగింది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఎక్కువ సంఖ్య లో కరోనా బారినపడుతున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు, తమన్, మంచు లక్ష్మి, త్రిష, ప్రియదర్శన్‌, వరలక్ష్మి శరత్ కుమార్ , మీనా లతో పాటు పలువురు కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. ఇక సత్యరాజ్ విషయానికొస్తే… విభిన్నమైన పాత్రలో తమిళంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘బాహుబలి’తో ప్రపంచానికి కట్టప్పగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్ యొక్క మూడవ వేవ్ భారతదేశంలో ప్రబలంగా ఉందని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి . ఈ సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విస్తృతంగా ప్రబలుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా దేశంలో కేసులు ఉప్పెన కొనసాగుతున్న సమయంలో సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి సెలబ్రిటీలను వణికిస్తుంది.