కరోనా పేషెంట్స్ తినకూడనివి

ఆహారం ఆరోగ్యం

Corona patients should not eat
Corona patients should not eat

కరోనా సోకినప్పుడు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మరి అదే సమయంలో యెలాండ్టి ఆహారానికి దూరంగా ఉండాలో తెలుసా. ? కరోనా చికిత్స సమర్ధంగా పని చేయాలనే అందుకు అడ్డుపడే పదార్ధాలను మానివేయాలి. అవి ఏంటంటే..

పాకేజ్డ్ ఫుడ్ :

కరోనా సోకడంతో నీరసించి పోతాము. వంట చేసుకునే ఓపిక ఉండదు . దీంతో వాడుకునే పని లేకుండా నేరుగా తినగలిగే ప్యాకేజ్డ్ ఫుడ్ ఎంచుకోవటం సరికాదు. ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో సోడియం తో పాటు నిల్వ కోసం ప్రీ సర్వ్ వేటివ్స్ ఉంటాయి. శరీరంలో ఇన్ఫమేషన్ పెంచే ఏ పదార్ధాలు కలిసిన ఆహారం తింటే కరోనా నుంచి కోలుకునే వేగం కుంటు పడుతుంది .

ఘాటు పదార్ధాలు

ఘాటుగా ఉండే మసాలాలు, కారాలు గొంతును ఇరిటేట్ హేసి , దగ్గును పెంచుతాయి. కాబట్టి పంటల్లో కారానికి , బదులుగా మిరియాల పొడి వాడుకోవాలి . మిరియాలకు యాంటీ బాక్ట్ట్రీ రియల్ , యాంటీ మైక్రో బియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి వ్యాధి నుంచి కోలుకోవటానికి మిరియాలు దోహద పడతాయి.

వేపుళ్ళు.

వేపుళ్లలో కొవ్వు పదార్ధాలు ఎక్కువ .. దీంతో పడే పడే తినాలనే కోరిక పెరుగుతుంది. పైగా ఇవి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం తీసుకునే , జీర్ణ వ్యవస్థ మీద భారం పెంచుతాయి. పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా మీద కొవ్వులు చూపిస్తాయి. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అంటే కాకుండా వేయించిన పదార్థాలు శరీరంలోచేదు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. కాబట్టి కరోనా నుంచి కోలుకునే సమయంలో వేపుళ్లకు దూరంగా ఉండాలి.

తీపి పానీయాలు

కరోనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చికిత్స తీసుకుంటూ కోలుకునే సమయంలో శీతల పానీయాలు మానేయాలి. తీపిగా ఉండే పానీయాలన్ని శరీరంలో ఇన్ఫల మేషన్ ను పెంచి కొలుకునే వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటికి బదులుగా మగ్గిగా, సోడా కలిపి నిమ్మరసం వంటి పానీయాలు ఎంచుకోవాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/