మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు…సర్వం సిద్ధం చేసిన అధికారులు

మార్చి 15 నుండి తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఈ క్రమంలో అధికారులు పరీక్షలకు సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 15 న ప్రారంభమై, ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 9.06 లక్షల రెగ్యులర్‌ విద్యార్థులుండగా, మరో 45 వేలు ప్రైవేట్‌ విద్యార్థులున్నారు.

వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలను నిర్వహించబోతున్నారు. ప్రశ్నపత్నాలను తెరవడం.. ఆన్సర్‌షీట్లను నింపే ప్రక్రియనంతా సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

ఇక పరీక్షల తాలూకా వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.