ఢిల్లీ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే

ట్రంప్‌ పర్యటనలో ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు?

asaduddin owaisi
asaduddin owaisi

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమేనని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ట్రంప్‌ పర్యటనలో ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భారతీయ పౌరులకు అమెరికా ఇస్తున్న గౌరవం ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి మత విద్వేషాలు కావని.. రాళ్లు రువ్వమని పోలీసులే రెచ్చగొడుతున్నారని ఒవైసీ పేర్కొన్నారు. బిజెపి ఎమ్మెల్యే స్థానిక డీసీపీతో కలిసి దాడులకు ప్రోత్సహిస్తున్నారన్నారు. జామియా, జేఎన్‌యూ.. ఎక్కడ చూసినా దాడులే చేస్తున్నారన్నారని.. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/