తక్షణ శక్తినిచ్చే తోటకూర

TOTAKOORA
Instant Energetic Gardener

మార్కెట్‌లో విరివిగా దొరికే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. ఈ ఆకుకూరలో పోషకాలు లెక్కలేనన్ని. బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా తోటకూర తినడం మంచిది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి తోటకూర తోడ్పడుతుంది. ఇది వేపుడు కన్నా వండిన కూరే మంచిది.

అలా అయితే అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది. తోటకూరలోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతవరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది. తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని తలకు రాసుకుంటే జుట్టు రాలదు.

మాడు మీద చుండ్రు ఉన్నా తగ్గుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్ని తోటకూరలో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం. పొటాషియం వంటివి సమకూరుతాయి.

విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ,సి,డి,ఇ,కె. విటమిన్‌ బి వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు ఇవన్నీ సమకూరుతాయి. వందగ్రాముల తోటకూర తింటే ఎన్నో క్యాలరీల శక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/