భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

Woman commits suicide
Woman commits suicide

హైదరాబాద్‌: భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందో వివాహిత. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో ఉన్న రోడ్ నంబర్ 10లో నివాసం ఉంటున్న సౌమ్య అనే వివాహిత ఉరేసుకుంది. భర్త రాఘవేంద్ర వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భార్య ఆత్మహత్య విషయం తెలియగానే భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు అతడ్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సౌమ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/