నల్లపూసలే.. మరింత అందంగా!

Jewellery

చుడీదార్‌ వేసుకున్న అమ్మాయిలు చెవ్ఞలకు పెద్ద పెద్ద జుంకీలు చేతులకి గాజులు ధరిస్తారు ఇక జీన్సు స్కర్టులాంటి మోడ్రన్‌ డ్రెస్‌లు వేస్తే లుక్‌ పూర్తిగా ట్రెండీగా మారిపోతుంది. మరి, కుమారి శ్రీమతి అయితే ఏముందీ మెడలో వేసుకునే నల్లపూసల్ని చేతికి బ్రేస్‌లెట్‌లా, వేళ్లకు ఉంగరాల్లా తగిలించేస్తారు. అవ్ఞను మరి! ఇది సరికొత్త ట్రెండ్‌.

పెళ్లైన అమ్మాయిలు నల్లపూసలు వేసుకోవడం సంప్రదాయం. కానీ జీన్సు టాప్‌లు మోడ్రన్‌ డ్రెస్‌ల మీదికి నల్లపూసల గొలుసులు వేసుకుంటే సెట్‌ కాదు. అలా అని పద్ధతిని పక్కన పెట్టేందుకు లేదు. ఇతరం అమ్మాయిలు మెడలో వేసుకునే నల్లపూసల్ని ఇలా బ్రేస్‌లెట్లలాగా, ఉంగరాల్లాగా మార్చి చేతికి వేళ్లకు పెట్టేస్తున్నారు.
ఇవి ఏ దుస్తులమీదికైనా సెట్‌ అవ్ఞతాయి ఫ్యాషన్‌గా కూడా ఉంటాయి. పైగా నల్లపూసల గొలుసుల్లో వచ్చినట్లే వీటిలోనూ బోలెడు వెరైటీలు వస్తున్నాయి. బాగున్నాయి కదా! మరి మీరు ట్రై చేస్తారా.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/