ఆలూ రసంతో శిరోజాల సంరక్షణ

Hair care tips

రసాయనాలు కలిపిన షాంపూల వాడకం వల్ల జుట్టుకు ముప్పు తప్ప తప్పడం లేదు. ఇందుకు కొన్ని జాగ్త్రతలు తీసుకోవాలి. జట్టు సంరక్షణకు ఆలూను కూడా ఉపయోగించవచ్చునంటున్నారు నిపుణులు. ఆలూ రసాన్ని నిమ్మరసాన్ని కలిపి మాడుకు రాయాలి. దాంతో మాడుపై తేమ నిలుస్తుంది. నిమ్మరసం బంగాళదుంప రసాన్ని సమానంగా కలిపి మాడుకు రాస్తే జుట్టు రాలే సమస్య తప్పుతుంది. బంగాళ దుంప రసాన్ని పదిహేను నిమిషాల పాటు మాకుడు పట్టించి మసాజ్‌ చేస్తే రక్తప్రసరణ మెరుగు పడుతుంది. బంగాళ దుంప రసాన్ని జుట్టుకు పట్టించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా నెలకు మూడు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. బంగాళదుంపను మెత్తగా చేసి రసాన్ని వడగట్టుకుని ఆ రసాన్ని మాడుకు పట్టించి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కొబ్బరి నీళ్లు తాగితే జుట్టుకు కావలసిన కాల్షియం లభిస్తుంది.
ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జట్టు పెరగాలంటే పడుకునే ముందు రెండు స్పూన్ల నూనెను తలకు రాసుకోవాలి. నూనెను వెంట్రుకలకు కాకుండా తలపై చర్మం, వెంట్రుకల మూలాలకు రాయాలి. మసాజ్‌ చేయడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/