వారి మధ్య పిల్లి,ఎలుక పోరు ఉండేది

ఆస్ట్రేలియా మాజి పేసర్‌ బ్రెట్‌లీ

brett lee
brett lee

సిడ్నీ: ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలర్‌ షేన్‌ వార్న్‌, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ గురించి ఆస్ట్రేలియా మాజి పేసర్‌ బ్రెట్‌లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సచిన్‌ను ఔట్‌ చేసేందుకు వార్న్‌ ఎంత ప్రయత్నించిన వార్న్‌ కు సచిన్‌ విసుగు తెప్పించేవాడని, లీ అన్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న పోరు నాకు పిల్లి, ఎలుక పోరులా అనిపించేదని అన్నాడు. వార్న్‌ ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినప్పటికి వాటికి ధీటుగా సచిన్‌ సమాధానం ఇచ్చే వాడని, వార్న్‌ బౌలింగ్‌ లో అలా ఆడడం ఎవరికి సాధ్యం కాదని కేవలం అది సచిన్‌కు మాత్రమే సాధ్యమని లీ చెప్పాడు. తనకు 22 సంవత్సరాల వయసు ఉన్నపుడు సచిన్‌తో ఆడే ఆవకాశం వచ్చిందని, తొలిసారి సచిన్‌ను ఔట్‌ చేసినపుడు ఇంక ఇది చాలు అనిపించింది. సచిన్‌ను ఔట్‌ చేయడం నేను సాధించిన పెద్ద ఘనత అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/