టికెట్ రాలేదని టిఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట: టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి తనకు టికెట్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేశాడు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు కాకుండా వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చారని మనస్తాపానికి గురై ఈ దారుణం చేసుకోబోయాడు. సహజంగా ఏ ఎన్నికల్లోనైనా అధికార పార్టీకి రెబల్ అభ్యర్థుల తాకిడి గట్టిగానే ఉంటుంది. వారంతా ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారేమో అనే టెన్షన్ టిఆర్‌ఎస్ అధినాయకత్వంలో ఉంది. అందుకే వారిని బుజ్జగించేందుకు ఆ పార్టీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అయితే టికెట్ రాని నేతలు మాత్రం చాలా చోట్ల వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సూర్యాపేటలో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వనందుకు ఆ పార్టీ నాయకుడు ఆత్మహత్యాయాత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పట్టణానికి చెందిన టిఆర్‌ఎస్ నేత అబ్ధుల్ రహీం తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. అయితే స్థానికుల వెంటనే రంగంలోకి దిగి అతడిని కాపాడారు. 39వ వార్డు నుంచి టికెట్ ఆశించి భారీ ఊరేగింపుతో వెళ్లి నామినేషన్ వేశారు. అయితే తనకు కాకుండా చైర్ పర్సన్ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న మొరిశెట్టి సుధారాణికి టికెట్ ఖరారు కావడంతో రహీం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/