వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ

ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్

India to face Australia at World Cup final; PM Modi likely to be guest of honour

న్యూఢిల్లీః ఆహ్మదాబాద్‌లోని మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారట. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెబుతున్నారు. మోడీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని తెలుస్తోంది.