దేశంలో కొత్తగా 10 వేల కరోనా కేసులు నమోదు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పదులు , వందల నుండి వేల సంఖ్యకు చేరాయి. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా పదివేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 10 వేల 158 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 45 వేలకు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఎనిమిది నెలల్లో ఈ స్థాయిలో కొత్త కేసులు రావటం ఇదే మొదటిసారి. ఎక్స్​బీబీ1.16 అనే వేరియంట్ కారణంగా భారత్​లో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆసుపత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్టు చెబుతున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో కొత్త కేసులు సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.