సలార్ టీజర్ కు ఆదిపురుష్ అడ్డు..?

టైటిల్ చూసి అదేంటి అనుకుంటున్నారా..? బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్..ఆ తర్వాత సాహో , రాధే శ్యామ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ , సలార్ చిత్రాలతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ఫై మొదట్లో భారీ అంచనాలు నెలకొని ఉండే , కానీ ఆ తర్వాత విడుదలైన టీజర్ , పోస్టర్స్ ఇలా అన్ని కూడా అంచనాలను తలకిందులు చేసాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో అనే భయంలో అభిమానులు ఉన్నారు.

ఇదే తరుణంలో సలార్ ఫై మరింత అంచనాలు పెంచేసుకుంటూ వస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు సినిమా నుంచి ఎలాంటి గ్లింప్స్‌ గానీ, టీజర్‌ గానీ రిలీజ్‌ చేయకుండానే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ప్రశాంత్‌నీల్, ప్రభాస్‌ను ఏ విధంగా చూపిస్తాడో అని అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ఇప్పటి నుంచే ప్రమోషన్‌లు షురూ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే సలార్‌ టీజర్‌ను కూడా కట్‌ చేశారట. అయితే ఆదిపురుష్‌ రిలీజయ్యాకే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు మొదలు పెట్టాలని మేకర్స్ తో ప్రభాస్‌ అన్నాడట. ఈ క్రమంలో ఆదిపురుష్‌ రిలీజైన వారం తర్వాత సలార్‌ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. సో ఆదిపురుష్ రిలీజ్ అయితే కానీ సలార్ బయటకు రాడు. ఆదిపురుష్ మూవీ జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది.