ఆ సత్తా భారత్‌కు ఉంది..మైక్ పాంపియో
చైనాపై ఆధారపడకండి.. భారత్‌ను కోరిన అమెరికా

న్యూఢిల్లీ: అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సదస్సులో అమెరికా విదేశాంగామంత్రి మైక్ పాంపియో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈసదస్సులో ఆయన ప్రసగించారు. చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని భారత్‌ను కొరారు. స్వదేశీ వస్తువుల సరఫరాను పెంచుకునే అంశంపై దృష్టి పెట్టాలని అగ్రరాజ్యం భారత్‌కు సూచన చేసింది. టెలికమ్యూనికేషన్లు, మెడికల్ సప్లయ్స కోసం చైనాపై ఆధారపడ వద్దు అంటూ ఆయన పేర్కొన్నారు. భారత్ మంచి స్థానంలో ఉన్నదని, ప్రపంచ దేశాల నమ్మకాన్ని ఆ దేశం పొందిందని, అమెరికా కూడా భారత్‌ను విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా అగ్రరాజ్యంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నమ్మకం చూరగొన్న భారత్‌కు చైనా నుంచి తరలిపోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించగల సత్తా ఉందని పేర్కొన్నారు.
లడఖ్ సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలోనూ చైనా తీరును అమెరికా తప్పుపట్టింది. సరిహద్దు ఘర్షణకు చైనాయే కారణమని పొంపియా అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రవర్తన అమోదయోగ్యంగా లేదన్నారు. పీఎల్ఏ దళాల వైఖరే దానికి కారణమని పొంపియో ఆరోపించారు. చైనాతో సరిహద్దు సమస్య తలెత్తిన నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత్ బ్యాన్ చేసింది. ఇదే తరహాలో అమెరికా కూడా చైనా యాప్‌లను బ్యాన్ చేయాలని భావిస్తున్నది. జీ7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడినిఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా పాంపియో గుర్తు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/