రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్​ దాఖ‌లు చేసిన యశ్వంత్ సిన్హా

opposition-presidential-polls-candidate-yashwant-sinha-files-his-nomination-at-the-parliament-in-delhi

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా.. నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోడీ కి నామినేషన్​ పత్రాలు సమర్పించారు. పార్ల‌మెంట్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీఆర్‌‌ఎస్‌‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్‌కు ముందు.. సిన్హాను బలపరుస్తున్న పార్టీల నేతలంతా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. నామినేషన్​ అనంతరం విజయ్‌చౌక్‌లో విపక్ష నేతలతో కలిసి యశ్వంత్‌ సిన్హా విలేకరులతో మాట్లాడనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/